India Asian Games Medals | ఆసియా గేమ్స్​.. భారత్​కు మరో మూడు పతకాలు

ఆసియా గేమ్స్​ షూటింగ్‌ మహిళల 50మీ రైఫిల్ విభాగంలో భారత్​ రజత పతకం గెలుచుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: India Asian Games Medals | ఆసియా గేమ్స్​ (Asian Games)లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. శనివారం ఉదయం మరో 3 పతకాలను సాధించారు. దీంతో భారత ఖాతాలో ఇప్పటి వరకు మొత్తం 26 పతకాలు చేరాయి.

పురుషుల మారథాన్ ఫైనల్‌లో సావన్ బర్వాల్ 2:11:37 సమయంతో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసి, సిల్వర్​ మెడల్ గెలుచుకున్నారు. ఈ విభాగంలో భారత్​ 44 ఏళ్ల తర్వాత పతకం సాధించడం గమనార్హం. షూటింగ్‌లో మహిళల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో తిలోత్తమ సేన్, విదర్శ వినోద్, ఆషి చౌక్సే రజతం గెలుచుకున్నారు. అంతేగాకుండా తిలోత్తమ, విదర్శ వ్యక్తిగత విభాగంలో ఫైనల్​కు చేరారు. జోష్నా చినప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్‌ల జోడీ మిక్స్‌డ్ డబుల్స్ స్క్వాష్ ఈవెంట్ నుండి కాంస్య పతకంతో నిష్క్రమించింది. సెమీఫైనల్‌లో ఈ జోడీ, హాంకాంగ్‌కు చెందిన లీ కా యి, టాంగ్ మింగ్ హాంగ్‌ల చేతిలో ఓడిపోయింది.

India Asian Games Medals | పలువురి నిరాశ

పలు విభాగాల్లో భారత క్రీడాకారులు నిరాశ పరిచారు. పురుషుల డెకాథ్లాన్ 100మీ హీట్ ఈవెంట్​లో తేజస్విన్ శంకర్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానూ స్ప్రింట్ – పురుషుల కయాక్ సింగిల్ 500మీ సెమీఫైనల్‌లో హర్షవర్ధన్ ఫైనల్​కు అర్హత సాధించాడు. టేబుల్​ టెన్నిస్​ మహిళల సింగిల్స్​లో యశస్విని ఓడిపోయింది.

ఇది కూడా చదవండి..: Asian Games | ఆసియా గేమ్స్​.. షూటింగ్​లో భారత్​కు మరో పతకం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *