Telangana Weather | నేటి నుంచి పెరగనున్న ఎండలు

రాష్ట్రంలో నేటి నుంచి ఎండలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Weather | రాష్ట్రంలో నేటి నుంచి ఎండలు పెరుగుతాయని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పడుతాయని పేర్కొన్నారు. అక్కడక్కడ జల్లులు మినహా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు.

వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజులుగా తెలంగాణ (Telangana)లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. తాజాగా దాని ప్రభావం తగ్గడంతో వర్షాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. పొడి గాలుల పెరిగి, శనివారం నుంచి తెలంగాణ అంతటా వేడి పరిస్థితులు కొనసాగనున్నాయి. తేమ, అధిక వేడి కారణంగా ఒకటి రెండు చోట్ల చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంతో సహా చాలా ప్రాంతాలు పొడిగా ఉంటాయి.

Telangana Weather | ముగిసిన రుతుపవన వర్షాలు

వర్షాకాలం సీజన్​కు సంబంధించి రుతుపవన వర్షాలు ముగిశాయి. ఈ ఏడాది ఎల్​నినో ప్రభావంతో వర్షాలు సరిగా పడలేదు. తెలంగాణలోని అనేక రిజర్వాయర్​లు సగం కూడా నిండలేదు. దీంతో సాగునీటికి రైతులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో పెద్ద వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్​ 27 నుంచి అక్టోబర్ 2 వరకు తెలంగాణ అంతటా తీవ్రమైన వేడి ఉంటుంది. పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 34-36 డిగ్రీలు నమోదు అవుతాయి. అక్టోబర్ 3-10 తేదీల మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: AFSPA Extension | సాయుధ దళాల చట్టాన్ని 6 నెలలు పొడిగించిన కేంద్రం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *