Basara Ganesh Immersion | బాసర వద్ద గణేష్ నిమజ్జనం బందోబస్తును పరిశీలించిన సీపీ

గణేష్ నిమజ్జనం సందర్భంగా బాసర బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు , భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు.

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Basara Ganesh Immersion | గణేష్ నిమజ్జనం సందర్భంగా బాసర బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు , భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పర్యవేక్షించారు. బాసర వద్ద ఆయన తనిఖీలు నిర్వహించారు.

Basara Ganesh Immersion | భక్తులకు ఇబ్బంది కలగకుండా..

ఈ సందర్భంగా నిమజ్జనానికి తరలివచ్చే గణేష్ విగ్రహాలు, భక్తులు వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సీపీ పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ , భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి..: Padmanagar Ganesh Laddu Auction | పద్మానగర్ గణపతి లడ్డూను దక్కించుకున్న బింగి రాకేష్.. 26న భక్తులకు పంపిణీ!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *