అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Women Kabaddi | ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టు సత్తాచాటింది. ఫైనల్లో ఇరాన్‌ను మట్టి కరిపించిన భారత అమ్మాయిలు బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఇరాన్‌ను 37-34 తేడాతో భారత్ (India) ఓడించింది.
టోకాయ్ సిటిజన్ జిమ్నాసియంలో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ గెలుపొందింది. భారత మహిళల కబడ్డీ జట్టు తన ఆసియా క్రీడల టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. ఫస్ట్ హాఫ్‌లో భారత్ ఆధిక్యం ప్రదర్శించింది. బ్రేక్ సమయానికి 22-16 ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్థభాగంలో ఇరాన్ అనుహ్యంగా పుంజుకొంది. ఓ దశలో లీడ్‌లోకి వెళ్లింది. ఈ సమయంలో భారత ప్లేయర్లు పాయింట్లు సాధించి భారత్‌కు స్వర్ణం అందించారు. ఆసియా క్రీడల్లో కబడ్డీ విభాగంలో భారత్‌కు ఇది మూడో స్వర్ణం కావడం గమనార్హం. అంతేగాకుండా ఈ సీజన్లో భారత్ మూడు స్వర్ణ పతకాలు సహా 27 పతకాలు గెలుచుకుంది.
India Women Kabaddi | విజయోత్సవాలు
గెలుపు అనంతరం భారత క్రీడాకారులు సంబరాలు చేసుకున్నారు. విజయోత్సాహంంతో మైదానం చుట్టూ విజయ యాత్ర చేసి ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించింది. 2018 జకార్తా క్రీడల్లో ఇరాన్ చేతిలో ఓడిన భారత మహిళలు రజతంతో సరిపెట్టుకున్నారు. తాజాగా స్వర్ణం గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆసియా క్రీడల్లో ఒక్కసారి మినహా అన్నింట్లో భారత్ బంగారు పతకం సాధించింది.
ఇది కూడా చదవండి..: India Asian Games Medals | ఆసియా గేమ్స్.. భారత్‌కు మరో మూడు పతకాలు