అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ram Charan Janhvi Kapoor | కాలం వెనక్కి వెళ్ళిందా? లేక నాటి టాలీవుడ్ అల్టిమేట్ మ్యాజికల్ కాంబినేషన్ మళ్లీ కళ్ల ముందు సాక్షాత్కరించిందా? ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక క్రేజీ వీడియో ఎడిట్ చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు.
1990లో మెగాస్టార్ చిరంజీవి, అతిలోకసుందరి శ్రీదేవి కలయికలో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ బాక్సాఫీస్‌ను ఎలా బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ఆ చిత్రంలోని “అబ్బనీ తీయని దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరోయబ్బ..” అనే పాట ఒక ట్రెండ్ సెట్టర్. నాటి తరం ప్రేక్షకులను ఊపేసిన ఆ క్లాసిక్ సాంగ్‌కు, నేటితరం క్రేజీ కాంబినేషన్ తోడైతే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే పూలరేకులు వికసించినట్లు ఉంటుంది.
Ram Charan Janhvi Kapoor | అచ్చం తండ్రిలాగే చరణ్, అమ్మలాగే జాన్వీ!
సరిగ్గా ముప్పై ఆరేళ్ల తర్వాత… మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ జంటగా రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) నుంచి వచ్చిన లేటెస్ట్ లుక్స్‌ను బేస్ చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అద్భుతమైన ఆడియో స్వాప్ ఎడిట్ హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ `@kclectic.mix` క్రియేట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
‘పెద్ది’ చిత్రం నుంచి వచ్చిన రామ్ చరణ్ ఊరమాస్ డ్యాన్స్ మూమెంట్స్, జాన్వీ కపూర్ అదిరిపోయే రెట్రో లుక్‌కు… బ్యాక్‌గ్రౌండ్‌లో వింటేజ్ “అబ్బనీ తీయని దెబ్బ” సాంగ్‌ను సింక్ చేసిన విధానం నెటిజన్లకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

Ram Charan Janhvi Kapoor | కళ్లు మూస్తే 90ల నాటి మ్యాజిక్.. కళ్లు తెరిస్తే 2026 నాటి క్రేజ్!
ఈ వీడియో చూసిన నెటిజన్లు మెగాస్టార్, శ్రీదేవిల నాటి స్క్రీన్ ప్రెజెన్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ క్లాసిక్ స్టెప్పులు, గ్రేస్ చూస్తుంటే అచ్చం చిరంజీవిగారే గుర్తొస్తున్నారని, జాన్వీ కపూర్‌లోని హావభావాలు, ఆ రెట్రో వైబ్స్ చూస్తుంటే శ్రీదేవిగారి ప్రతిరూపంలా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కళ్లు మూసుకుని వింటే 90ల నాటి బ్లాక్‌బస్టర్ వింటేజ్ సాంగ్ వింటున్నట్లు ఉంటుంది.. కళ్లు తెరిచి చూస్తే 2026 టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ కళ్లముందు కనిపిస్తోంది” అంటూ ఈ రీల్‌ను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
నాడు తండ్రి-తల్లి క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను.. నేడు వారి వారసులు అదే పాటపై స్టెప్పులతో రీ-క్రియేట్ చేస్తే చూడాలనే అభిమానుల కల, ఈ ఫ్యాన్ మేడ్ ఎడిట్‌తో సోషల్ మీడియాలో నిజమైంది. ప్రస్తుతం ఈ క్రేజీ వీడియో నెట్టింట సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది!
Swathi Reddy | పెళ్ళి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్…..


