సినిమాShruti Haasan Marriage | త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న శృతి హాస‌న్.. ల‌వ్వా లేకుంటే...

Shruti Haasan Marriage | త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న శృతి హాస‌న్.. ల‌వ్వా లేకుంటే అరెంజ్డ్ మ్యారేజా?

శ్రుతి హాసన్ పెళ్లిపై మరోసారి రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్‌కు ఓకే చెప్పిందనే వార్తలు వైరల్ అవుతుండగా, అధికారిక స్పష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shruti Haasan Marriage | లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Hassan) కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్‌గా తమిళం, తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, కేవలం నటిగానే కాకుండా సింగర్‌, మ్యూజిక్ కంపోజర్‌గా కూడా తన ప్రతిభను చాటింది.

అయితే ఇటీవల కాలంలో ఆమె సినిమాల కంటే వ్యక్తిగత విషయాల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. శృతి హాసన్ (Shruti Haasan) చివరిసారిగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె నుంచి ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడలేదు. దీంతో ఆమె కెరీర్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆమె పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

Shruti Haasan Marriage

Shruti Haasan Marriage | పెద్ద‌లు కుదిర్చిన సంబంధం..

గతంలో లండన్‌కు చెందిన ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలే (Artist Michael Corsale)తో శ్రుతి ప్రేమలో ఉంది. కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరూ డేటింగ్‌లో ఉండగా, ఆ తర్వాత అనుకోని కారణాలతో విడిపోయారు. అనంతరం విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో కూడా ఆమె రిలేషన్‌లో ఉంది. కానీ ఆ సంబంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శృతి హాసన్ అరేంజ్డ్ మ్యారేజ్‌కు ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పెద్దలు చూసిన వరుడితోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి కమల్ హాసన్ స్వయంగా సంబంధాలు చూసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని సంబంధాలను పరిశీలించినప్పటికీ అవి ఫైనల్ కాలేదని చెబుతున్నారు. త్వరలోనే ఆమె పెళ్లి జరగాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Shruti Haasan Marriage | గతంలో కూడా పలుమార్లు ఇలాంటి రూమర్లు

అయితే, శృతి హాసన్ పెళ్లి గురించి ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి రూమర్లు వచ్చాయి. చివరకు అవన్నీ వదంతులుగానే మిగిలిపోయాయి. దీంతో ప్రస్తుతం వస్తున్న ఈ వార్తలపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే, దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇది కూడా చదవండి..: Dhurandhar 2 Box Office | బాక్సాఫీస్ వద్ద సంచలనం.. ‘ధురంధర్ ది రివెంజ్’ దూకుడు, పుష్ప 2 రికార్డ్ బ్రేక్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....