Nandana Notices | యూట్యూబర్ రమానందనకు షాక్​.. మరోసారి పోలీసుల నోటీసులు

యూట్యూబర్​ ‘నందూస్​ వరల్డ్​’ నందనకు మరో షాక్​ తగిలింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nandana Notices | యూట్యూబర్​ ‘నందూస్​ వరల్డ్​’ నందన (YouTuber Nandana)కు మరో షాక్​ తగిలింది. ఉద్యోగాలిప్పిస్తామంటూ కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు వసూలు చేసిన కేసులో అద్దంకి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Nandana Notices | అద్దంకిలో కేసు నమోదు

ఏపీలోని అద్దంకి మండలానికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాసరావు తన కోడలికి యూకేలో ఉద్యోగం నిమిత్తం.. గుంటూరులో ప్రైవేటు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రమానందన మామ మోహనరావును 2023లో సంప్రదించారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్​ కింద రూ.లక్ష చెల్లించారు. అన్నిరకాల పత్రాలు పూర్తిచేసిన అనంతరం మరో రూ. 9.60 లక్షలు ఇచ్చారు. డబ్బులు చెల్లించడంతో ప్రాసెస్​ పూర్తి చేసినా అటు ఉద్యోగం రాక.. ఇటు చెల్లించిన నగదు వాపసు చేయకపోవడంతో బాధితుడు ఈ ఏడాది జూన్​లో అద్దంకి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులకు కేసు నమోదు చేశారు.

Nandana Notices | బిగ్​బాస్​ కోసం హైదరాబాద్​కు..?

బాధితుల ఫిర్యాదుతో కన్సల్టెన్సీ నిర్వాహకులైన మోహనరావు, రమానందనతో పాటు మరికొందరిపై అద్దంకి పీఎస్​లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె న్యాయవాదిని వెంటబెట్టుకుని అద్దంకి పోలీస్ స్టేషన్​కు వచ్చి పోలీసుల నుంచి నోటీసులు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే యూకే పౌరసత్వం కలిగిన రమానందన బిగ్ బాస్ షోకు ఎంపికవడంతోనే హైదరాబాద్ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చదవండి..: Celebrity Voter Notices | రాజమౌళి, మహేష్ బాబుకు ఈసీ నోటీసులు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *