సినిమాExhibitors Dispute | మెగాస్టార్​ చొరవతో ‘ఎగ్జిబిటర్ల’ వివాదానికి పరిష్కారం

Exhibitors Dispute | మెగాస్టార్​ చొరవతో ‘ఎగ్జిబిటర్ల’ వివాదానికి పరిష్కారం

మెగాస్టార్​ చిరంజీవి ఎగ్జిబిటర్ల సమస్యకు పరిష్కారం చూపారు. నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో చర్చించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Exhibitors Dispute | ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా తాను ముందుంటానని మరోసారి మెగాస్టార్ చిరంజీవి నిరుపించారు. టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ‘రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్’ వివాదానికి చిరు జోక్యంతో తెర పడింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని రోజులుగా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు తమకు థియేటర్లలో రెంటల్ విధానానికి బదులు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్​ చేశారు. దీనిని నిర్మాతలు వ్యతిరేకించారు. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలు, విమర్శల వరకు పరిస్థితి వెళ్లింది. రామ్​చరణ్​ నటించిన పెద్ది మూవీ విడుదల సమయంలో వివాదం చెలరేగడంతో చిరంజీవి రంగంలోకి దిగారు.

Exhibitors Dispute | ముగ్గురితో సమావేశం

నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో చిరంజీవి వేర్వేరుగా తన నివాసంలో సమావేశం అయ్యారు. మూడు రంగాల ప్రతినిధులను ఒకే తాటిపైకి తెచ్చారు. మెగాస్టార్ హామీతో జూన్ 30 వరకు ప్రస్తుత ‘రెంటల్ విధానం’ కొనసాగించేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్లు అంగీకరించారు. అప్పటిలోపు ‘పర్సెంటేజ్ విధానం’పై చాంబర్ కమిటీ ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తామని చిరంజీవి భరోసా ఇచ్చారు. కాగా జూన్​ 4న రామ్​చరణ్​ నటించిన పెద్ది మూవీ విడుదల కానుంది. ఎగ్జిబిటర్ల నిర్ణయంతో పెద్ది మూవీకి ఇబ్బందులు తప్పాయి.

megastar

దీనిని కూడా చదవండి : Swathi Reddy | పెళ్ళి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్.. నటి 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...