Ajith Mother Passed Away | కోలీవుడ్‌లో విషాదం.. అజిత్ కుమార్‌కు మాతృవియోగం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ajith Mother Passed Away | తమిళ చిత్ర పరిశ్రమ (Tamil Film Industry)లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అజిత్ కుమార్  కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది. ఆయన తల్లి మోహిని మణి శనివారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుమూసినట్లు సమాచారం. మోహిని మణి మృతి వార్త తెలియగానే తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తూ అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులకు ఈ లోటు తీరనిదని పేర్కొంటూ పలువురు సంతాప సందేశాలు పోస్టు చేస్తున్నారు.

Ajith Mother Passed Away | మరింత బాధాక‌రం..

Ajith Mother Passed Away

ప్రస్తుతం అజిత్ కుమార్ (Ajith Kumar) దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తల్లి మరణవార్త అందుకున్న వెంటనే ఆయన అత్యవసరంగా చెన్నైకి బయలుదేరినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అజిత్ చెన్నై చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి కూడా అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆ సమయంలో తండ్రి మృతితో తీవ్ర భావోద్వేగానికి లోనైన అజిత్, ఇప్పుడు తల్లిని కూడా కోల్పోవడం ఆయన కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టింది. తల్లిదండ్రులిద్దరినీ కొద్ది కాల వ్యవధిలో కోల్పోవడం కుటుంబ సభ్యులను కలచివేసింది.

Ajith Mother Passed Away | అజిత్ కుటుంబానికి అండగా

Ajith Mother Passed Away

సినిమాలతో పాటు మోటార్ రేసింగ్ రంగంలోనూ విశేష గుర్తింపు పొందిన అజిత్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం ఆయనను తీవ్రంగా కలచివేసిందని సన్నిహితులు చెబుతున్నారు. అజిత్ తల్లి మోహిని మణి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. కోలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం ఈ విషాదంలో అజిత్ కుటుంబానికి అండగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి..: Murugan Temple | మంత్రిని లంచం అడిగిన అర్చకులు.. ఎక్కడో తెలుసా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *