Murugan Temple | మంత్రిని లంచం అడిగిన అర్చకులు.. ఎక్కడో తెలుసా?

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Murugan Temple | దేశంలో బడి నుంచి గుడి వరకు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి సచివాలయ వరకు అవినీతి రాజ్యం ఏలుతోంది. ఈ విషయం అందరికి తెలుసు. అయినా చర్యలు చేపట్టడానికి ఎవరు ముందుకు రారు. ఓ గుడిలో అర్చకుల అవినీతిని మంత్రి రెడ్ హ్యాండ్​డెగ్​ పట్టుకున్నారు.

తమిళనాడు (Tamil Nadu)లోని తిరుచెందూరు మురుగన్ ఆలయంలో అర్చకుల అవినీతికి పాల్పడుతున్నారు. వీఐపీ దర్శనం చేయిస్తామని భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అర్చకుల అవినీతిపై మంత్రి రమేష్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. సామాన్య భక్తుడిగా మాస్క్ ధరించి మంత్రి గుడికి వెళ్లారు. వీఐపీ దర్శనం చేయిస్తానని మంత్రి నుంచి వారు రూ.4 వేలు అడిగారు. దీంతో మంత్రి రమేశ్​ వారికి గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించారు. అనంతరం ఆలయంలో దర్శనం పూర్తి చేసుకున్నారు. తర్వాత మాస్క్​ తీసి షాక్​ ఇచ్చారు

Murugan Temple | సస్పెన్షన్​ వేటు

Murugan Temple

హిందూ మత, ధార్మిక దానాల (హెచ్‌ఆర్ & సీఈ) శాఖ మంత్రి రమేష్, తన గుర్తింపును దాచిపెట్టేందుకు మాస్క్ ధరించి తమిళనాడులోని తిరుచెందూర్ మురుగన్ ఆలయం (Tiruchendur Murugan Temple)లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆలయంలో పలు అవకతవకలను ఆయన గుర్తించారు. వీఐపీ దర్శనం కోసం మంత్రి నుంచి డబ్బులు తీసుకున్న హెచ్‌ఆర్ & సీఈ శాఖ ఒక పూజారిని, ఇద్దరు భద్రతా సిబ్బందిని ఆయన సస్పెండ్​ చేశారు. కేశదానం (ముండన్) సేవల కోసం భక్తుల నుంచి డబ్బు వసూలు చేసిన ఆరోపణలపై మరో ఇద్దరు సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు.

Murugan Temple | ఫిర్యాదులు రావడంతో..

Murugan Temple

తనిఖీ అనంతరం మంత్రి రమేష్ మాట్లాడుతూ, తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో అవకతవకలకు సంబంధించి చాలా మంది భక్తులు, సామాజిక కార్యకర్తలు ఫిర్యాదులు చేశారన్నారు. అందుకే నేను మాస్క్ ధరించి తనిఖీ నిర్వహించానని చెప్పారు. వీఐపీ దర్శనం కోసం ఆలయ సిబ్బంది భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యకలాపాలలో పూజారులు, ఆలయ అధికారులు కూడా పాలుపంచుకుంటున్నారని చెప్పారు. దీనిపై చర్యలు చేపడుతామన్నారు. మంత్రి చర్యలపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Supreme Court Sex Workers | సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. పోలీసులకు, మీడియాకు సంచలన మార్గదర్శకాలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *