Chiru Health Rumors | చిరంజీవి ఆరోగ్యంపై ఫేక్ ప్రచారం.. యూట్యూబ్ ఛానెల్‌పై కేసు నమోదు

Srinivas Kolluri

అక్షరటుడే, హైదరాబాద్: Chiru Health Rumors | ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఒక యూట్యూబ్ ఛానెల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు (Jubilee Hills Police) కేసు నమోదు చేశారు. చిరంజీవి ఆరోగ్యం క్షీణించిందంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ మార్ఫింగ్ వీడియోలు, అభ్యంతరకర కంటెంట్‌ను వైరల్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం, కమలాపురి కాలనీకి చెందిన న్యాయవాది రామకృష్ణ మిర్యాల ఈ అంశంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ (Jubilee Hills Police Station)లో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో, ఒక యూట్యూబ్ ఛానెల్ ఉద్దేశపూర్వకంగా చిరంజీవి ఆరోగ్యంపై నిరాధార కథనాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు.

Chiru Health Rumors | యూట్యూబ్ ఛానెల్‌పై కేసు..

సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్న వీడియోలు, మార్ఫింగ్ కంటెంట్ నటుడి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని, అభిమానుల్లో అనవసర ఆందోళన సృష్టించేలా రూపొందించారని ఫిర్యాదులో వివరించారు. దీనికి సంబంధించిన వీడియో లింకులు, స్క్రీన్‌షాట్లు వంటి డిజిటల్ ఆధారాలను కూడా పోలీసులకు అందజేశారు.ఫిర్యాదు స్వీకరించిన అనంతరం పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. తదుపరి న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా కోర్టు అనుమతి తీసుకుని సంబంధిత యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Chiru Health Rumors | విడుద‌ల‌కి సిద్ధంగా విశ్వంభ‌ర

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ప్రముఖుల వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం వంటి అంశాలపై తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక చిరంజీవి ఈ వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవ‌ల బాబీతో కొత్త ప్రాజెక్ట్ మొద‌లుపెట్టారు. మ‌రోవైపు చిరు న‌టించిన విశ్వంభ‌ర విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది.

ఇది కూడా చదవండి..: Aaya Share Song | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాని ‘ఆయా షేర్’ సాంగ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *