Bharathiraja Death | ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే. సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాల ద్వారా ఆయన తన సృజనాత్మకతను చాటుకున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bharathiraja Death | భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త సినీ వర్గాలను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Bharathiraja Death | విప్లవాత్మక మార్పులకు నాంది

1977లో విడుదలైన 16 Vayathinile చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన భారతీరాజా, గ్రామీణ నేపథ్య కథలను వెండితెరపై సహజత్వంతో ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తమిళ చిత్రసీమలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన దర్శకులలో ఆయన ఒకరిగా నిలిచారు.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే

తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే. సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాల ద్వారా ఆయన తన సృజనాత్మకతను చాటుకున్నారు. దర్శకుడిగానే కాకుండా పలు చిత్రాల్లో నటుడిగా కూడా మెప్పించి, తన విలక్షణ నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు.

భారతీరాజా మరణంపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతున్నారు.

Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *