June 10 Market Analysis | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు

గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 10 Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తన హెలికాప్టర్‌ను కూల్చివేసినందుకు ప్రతీకారంగా అమెరికా.. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ, భూ నియంత్రణ కేంద్రాలు, నిఘా రాడార్ స్థావరాలపై దాడులు చేసింది.

దీనికి ప్రతిస్పందనగా బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళంపై డ్రోన్‌లతో దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో స్టాక్ మార్కెట్లు(Stock markets) ఎరుపెక్కాయి.

ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతను అనుసరించి భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

June 10 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

అమెరికా -ఇరాన్ ల పరస్పర దాడుల నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య శాంతి ఒప్పందం అవకాశాలపై సందేహాలు పెరిగాయి. దీంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది.

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.97 శాతం, ఎస్ అండ్ పీ 0.26 శాతం నష్టపోగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.15 శాతం నష్టంతో ఉంది.

June 10 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.05 శాతం పెరగ్గా.. జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.75 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 1.43 శాతం నష్టపోయాయి.

June 10 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 3.67 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.27 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.12 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.46 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.06 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.71 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.22 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 10వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,566 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు 16వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 6,159 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో (PCR) 0.78 నుంచి 1.06 కు పెరిగింది.
  • విక్స్ 8.53 శాతం తగ్గి 15.57 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 92.66 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 37 పైసలు బలపడి 95.35 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 100 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.54 వద్ద ఉన్నాయి.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *