అక్షరటుడే, వెబ్‌డెస్క్: June 10 Horoscope | గ్రహాల గమనం వల్ల ఈ రోజు (బుధవారం, జూన్ 10) పలు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పదోన్నతులు, ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది.
ఆదాయం పెరిగి, అనుకోని ధన లాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మరికొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఆరోగ్యం విషయంలో స్వల్ప ఇబ్బందులు ఎదురవ్వచ్చు, కాబట్టి జాగ్రత్త అవసరం.
June 10 Horoscope | రాశుల వారీగా..
మేష రాశి: June 10 Horoscope | ఉద్యోగంలో వాతావరణం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న కష్టాలు తీరుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ మార్పులకు అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వృషభ రాశి: June 10 Horoscope | ఉద్యోగంలో మంచి గుర్తింపు, ప్రమోషన్ లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కీలకమైన వ్యక్తిగత పనులు పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇవాళ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి.
మిథున రాశి: June 10 Horoscope | ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పని ఒత్తిడి వల్ల విశ్రాంతి ఉండకపోవచ్చు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కష్టసమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం చూసే విద్యార్థులకు మంచి వార్త అందుతుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
కర్కాటక రాశి: June 10 Horoscope | ఉద్యోగంలో మీ ప్రభావం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఇంటా బయట అంతా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆస్తి, ఆర్థిక విషయాలు సవ్యంగా సాగుతాయి. తోబుట్టువులతో ఆస్తి తగాదాలు తొలగిపోతాయి.
సింహ రాశి: June 10 Horoscope | వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నా ఆశించిన ఫలితం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. దీని వలన ఆర్థికంగా ఇబ్బందులు ఉండదు. సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్లు వస్తాయి.
కన్యా రాశి: June 10 Horoscope | ఉద్యోగ జీవితం సజావుగా సాగుతుంది. పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. మిత్రుల సాయంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. దూర ప్రాంతంలోని పిల్లల నుండి శుభవార్తలు వింటారు.
తుల రాశి: ఉద్యోగంలో కీలక బాధ్యతలు లేదా అధికారం చేపట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. అదనపు ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో లాభం ఉంటుంది. తల్లిదండ్రుల సహకారంతో ఆర్థిక సమస్యలు తీరుతాయి.
వృశ్చిక రాశి: వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం బాగుంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు చేతిలో ఉంటుంది. ఆస్తి కొనుగోలు , అమ్మకాలలో లాభాలు పొందుతారు. పనులు పూర్తి చేయడంలో కాస్త శ్రమ ఉన్నా విజయం సాధిస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.
ధనుస్సు రాశి: ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. ఇవాళ తలపెట్టిన పనులన్ని నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. తోబుట్టువులతో వివాదాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
మకర రాశి: ఉద్యోగంలో మీరు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఇవాళ ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. రావలసిన డబ్బు ఎట్టకేలకు మీ చేతికి అందుతుంది. నిరుద్యోగులకు అనుకూల ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభ రాశి: ఉద్యోగంలో తోటి వారి సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తారు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి ఇవాళ పరిష్కారం అవుతుంది.
మీన రాశి: ఇవాళ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు, పదోన్నతులు లభిస్తాయి. ఆధ్యాత్మిక పనుల్లో పాల్గొంటారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి.” వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
