అక్షరటుడే, వెబ్‌డెస్క్:Kavya Maran Wedding | సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్యా మారన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహంపై మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజా కథనాల ప్రకారం.. వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ నవంబర్ 10న గ్రీస్ Greece లో జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ తేదీ, వేదికకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Kavya Maran Wedding | నటుడు వై.జి. మహేంద్రన్ వ్యాఖ్యలతో..
అనిరుధ్, కావ్యా మారన్ వివాహంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో అనిరుధ్ మామ, నటుడు వై.జి. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనిరుధ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని, ఇది ఖాయమని వ్యాఖ్యానించారు. కావ్యా మారన్‌ను ప్రశంసిస్తూ వారిద్దరూ మంచి జంటగా ఉంటారని కూడా పేర్కొన్నారు.
Kavya Maran Wedding | సామాజిక మాధ్యమాల్లో వైరల్
మహేంద్రన్ వ్యాఖ్యలతో వీరి పెళ్లిపై చర్చ మరింత ఊపందుకుంది. అయితే అనిరుధ్ రవిచందర్, కావ్యా మారన్ ఇద్దరూ తమ సంబంధం లేదా పెళ్లిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో నవంబర్ 10న గ్రీస్‌లో వివాహం జరుగుతుందన్న వార్తలను ప్రస్తుతానికి ధృవీకరించని సమాచారంగానే చూడాల్సి ఉంటుంది.
ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఇదిలా ఉండగా, తాజా నివేదికలతో వీరి పెళ్లి తేదీ ఖరారైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అయితే ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలపై స్పష్టత రానుంది.