సినిమాPrabhas Spirit Look | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ గుండు లుక్?.. లీకైన ఫోటోతో సోషల్...

Prabhas Spirit Look | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ గుండు లుక్?.. లీకైన ఫోటోతో సోషల్ మీడియా షేక్

గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన ఓ లీక్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Prabhas Spirit Look | గ్లోబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Director Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. ప్రభాస్‌ను ఆయన ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఇలాంటి సమయంలో సోషల్ మీడియా (Social Media)లో ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫోటో ఒక్కసారిగా వైరల్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ లీకైన ఫోటోలో ప్రభాస్ పూర్తిగా గుండు లుక్‌లో, ఖైదీ తరహా గెటప్‌లో కనిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ చూడని ఈ మేకోవర్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Prabhas Spirit Look | గుండు లుక్ క‌హానీ ఏంటి..

ప్రస్తుతం ఈ ఫోటో నిజంగా ‘స్పిరిట్’ సినిమా (Spirit Movie) షూటింగ్‌కు సంబంధించినదేనా? లేక ఫ్యాన్ మేడ్ లేదా ఏఐ క్రియేటెడ్ ఇమేజ్ మాత్రమేనా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే లుక్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుండు లుక్ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసమా? లేక క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో భాగమా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

Prabhas Spirit Look | ‘స్పిరిట్’ కోసం మరోసారి భారీ రిస్క్

ప్రభాస్ డెడికేషన్‌ను అభిమానులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ప్రతి సినిమాకు కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తున్న ప్రభాస్.. ‘స్పిరిట్’ కోసం మరోసారి భారీ రిస్క్ తీసుకున్నట్టుగా కనిపిస్తోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రా ఎమోషన్స్, ఇంటెన్స్ క్యారెక్టర్లు, హై వోల్టేజ్ యాక్షన్‌తో సినిమాలను తెరకెక్కించే ఆయన.. ప్రభాస్ మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తారని అభిమానులు నమ్ముతున్నారు. “సందీప్ మార్క్ వైలెన్స్‌కు ప్రభాస్ మాస్ అప్పీల్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం ఖాయం” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఈ ఫోటో వైరల్ కావడంతో ‘స్పిరిట్’ టీమ్ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సినిమా కథ, పాత్రలపై ఉన్న సస్పెన్స్‌కు ఇలాంటి లీకులు ప్రభావం చూపించే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ ఒక్క ఫోటో మాత్రం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఇది ఒరిజినల్ ఫోటో కాదని, ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఇమేజ్ కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ ద్వారా సెలబ్రిటీల ఫేక్ లుక్స్ సృష్టించడం సాధారణమైపోయిన నేపథ్యంలో.. ఈ ఫోటోపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Ashu Reddy Notices | అషురెడ్డికి పోలీసుల నోటీసులు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...