Kurchi Tatha Death | ‘ఆ కుర్చీని మడత పెట్టి’ ఫేమ్ కుర్చీ తాత కన్నుమూత.. భార్య ఒడిలో తుది శ్వాస విడిచిన అహ్మద్ పాషా

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kurchi Tatha Death | సోషల్ మీడియాలో “ఆ కుర్చీని మడత పెట్టి” అనే ఒక్క డైలాగ్‌తో అపారమైన గుర్తింపు తెచ్చుకున్న షేక్ అహ్మద్ పాషా (64) mohammed pasha అలియాస్ కుర్చీ తాత కన్నుమూశారు. ఆయన మృతి వార్త సోషల్ మీడియా అభిమానులు, నెటిజన్లను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సాధారణ వ్యక్తిగా జీవితం గడిపిన పాషా, ఒక వైరల్ డైలాగ్‌తో లక్షలాది మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

Kurchi Tatha Death | సోషల్ మీడియా ద్వారా అనూహ్యమైన గుర్తింపు

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన షేక్ అహ్మద్ పాషా సుమారు 40 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. నగరంలో కుటుంబంతో కలిసి స్థిరపడ్డ ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సాధారణ జీవితం గడిపే పాషా, తరువాత సోషల్ మీడియా ద్వారా అనూహ్యమైన గుర్తింపు పొందారు.

Kurchi Tatha Death | కుర్చీ తాత ఇక లేరు..

హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పాషా, అక్కడికి వచ్చే యూట్యూబ్ ఛానళ్లకు తరచూ ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. అలాంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన “ఆ కుర్చీని మడత పెట్టి” అనే డైలాగ్ ఒక్కసారిగా వైరల్ అయింది.

ఆ డైలాగ్‌తో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. సోషల్ మీడియా వేదికలైన రీల్స్, మీమ్స్, షార్ట్ వీడియోల్లో ఈ డైలాగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. అప్పటి నుంచి షేక్ అహ్మద్ పాషా కంటే “కుర్చీ తాత” Kurchi Tatha అనే పేరే ప్రజల్లో బాగా గుర్తింపు పొందింది.

అంతేకాకుండా ఆయన డైలాగ్ సినీ పరిశ్రమ దృష్టిని కూడా ఆకర్షించింది. పలువురు కంటెంట్ క్రియేటర్లు, సెలబ్రిటీలు ఆయనను ప్రస్తావించగా, ఆయనకు మరింత క్రేజ్ వచ్చింది.

అయితే మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తుండగా తీవ్ర ఎండ ప్రభావంతో పాషా ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయారు. అక్కడ ఉన్న ఇతర వాకర్స్ Walkers వెంటనే అప్రమత్తమై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు పాషాకు ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు.

మొదట పరిస్థితి కాస్త సాధారణంగానే కనిపించినప్పటికీ, బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాషా, తన భార్య ఆసియా సుల్తానా ఒడిలో తలపెట్టి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Cockroach Jantha Party | నిరుద్యోగుల ‘బొద్దింక’ గర్జన: దేశ రాజకీయాల్లో…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *