Ponguleti Paper Controversy | మంత్రి వాకిటి శ్రీహరి మీద పేపర్లు విసిరేసిన పొంగులేటి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Ponguleti Paper Controversy | రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం సాయంత్రం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్​లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, వాకిటి శ్రీహరి (Minister Srihari), అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ మీడియాకు వివరాలు వెల్లడించారు.

మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో తన చేతిలో ఉన్న పేపర్లు వాకిటి శ్రీహరివైపు విసిరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సహచర మంత్రిపై పేపర్లు విసరడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రెస్ మీట్ మధ్యలో బీసీ ప్రజల ప్రతినిధి వాకిటి శ్రీహరిపై పేపర్లు విసిరేసి, అవమానించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti srinivas reddy) తీరును సభ్యసమాజం అసహ్యించుకుంటుందని పేర్కొన్నారు. పొంగులేటి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.

Ponguleti Paper Controversy | కీలక నిర్ణయాలు

మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సగం వరకు ఇళ్లు నిర్మించుకున్న వారికి ఆర్థిక సాయం చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అంతా బాగానే ఉన్నా ఓ బీసీ మంత్రిపై పొంగులేటి పేపర్లు విసిరేయడంపై నెటిజన్లు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతున్న హస్తం పార్టీకి పొంగులేటి మరో తలనొప్పి తెచ్చారు.

దీనిని కూడా చదవండి : Caste Names Change | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కులాల పేర్లు మార్పు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *