May 21 Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 21 Market Analysis | జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గుతుండటంతో గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్ గా సాగుతున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌తోపాటు యూరోప్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం లాభాలతో సాగుతున్నాయి.

May 21 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

చిప్ స్టాక్స్‌లో ర్యాలీతో వాల్‌స్ట్రీట్ లో నష్టాలకు తెరపడింది. మÖడు సెషన్‌ల తర్వాత పాజిటివ్‌గా ముగిశాయి. గత సెషన్‌లో నాస్‌డాక్ 1.54 శాతం, ఎస్ అండ్ పీ 1.08 శాతం పెరిగాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.15 శాతం నష్టంతో ఉంది.

May 21 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.67 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.36 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.98 శాతం లాభపడ్డాయి.

May 21 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 6.41 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 3.54 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3.49 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.71 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.43 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.31 శాతం లాభాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.59 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు రెండో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,597 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు 3వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,969 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.10 నుంచి 1.24 కు పెరిగింది.
  • విక్స్ 1.26 శాతం తగ్గి 18.44 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.40 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు బలహీనపడి 96.82 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.36 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.58 వద్ద ఉన్నాయి.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *