అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Say No To Drugs | డ్రగ్స్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సూచించారు. సినిమా నటులు, దర్శకులు అందరూ #SayNoToDrugs అంటూ వీడియోలు చేసి రిలీజ్ చేయాలని కోరారు.
అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, సినీనటులు రామ్ పోతినేని, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. సినీ నటులు చెప్పే మాటలకు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భట్టి అన్నారు. వారు చెప్పే మాటలను ఫ్యాన్స్ ఫాలో అవుతారన్నారు. అందుకే దర్శకులు, హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు.
Say No To Drugs | ఈగల్ ఫోర్స్‌కు ఫుల్ పవర్స్
తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దని భట్టి పేర్కొన్నారు. ఈగల్ ఫోర్స్ (Eagle Force)కు ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈగల్ ఫోర్స్ సంపూర్ణంగా పనిచేసేలా అన్ని వసతులు కల్పించామని, డ్రగ్స్ కట్టడికి ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకుంటామని తెలిపారు.
Say No To Drugs | డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి, మత్తు పదార్థాలకు “నో” చెప్పి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి అందరం కలిసి పనిచేయాలని సూచించారు.
“సినిమా నటులు, దర్శకులు అందరూ #SayNoToDrugs అంటూ వీడియోలు చేసి రిలీజ్ చేయాలని కోరుతున్నా” – తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka Mallu appealed to actors and filmmakers to release videos carrying the message #SayNoToDrugs to spread awareness against drug… pic.twitter.com/Z8m2SsxlCB
— Akshara Today | Telugu News (@aksharatoday) June 26, 2026
దీనిని కూడా చదవండి: Fee Reimbursement | ఫీజుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ.. విద్యా ప్రమాణాల్లోనూ చూపాలి: విజయశాంతి