అక్షరటుడే, వెబ్డెస్క్ : Rythu Bharosa Funds | రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలోని శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బటన్ నొక్కి రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించారు.
సీఎం రేవంత్రెడ్డి రూ.2,482.02 కోట్ల నిధులు విడుదల చేశారు. తొలి విడతలో 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రెండు ఎకరాలలోపు రైతులకు మొదట డబ్బులు జమ కానున్నాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని పండుగు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 2014 నాటికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.69 వేల కోట్ల అప్పు చేశారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణను అప్పగిస్తే.. కల్వకుంట్ల కుటుంబం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పుల ఊబిలో ముంచిందన్నారు.
Rythu Bharosa Funds | ఉద్యోగులకు జీతాలు

బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు ఒకటో తారీఖున వేతనాలు అందేవి కాదన్నారు. తాను అధికారంలోకి రాగానే జీతాలు ఒకటో తేదిన వచ్చేలా చేశానన్నారు. కేసీఆర్ హయాంలో సర్పంచులకు వందల కోట్ల బకాయిలు, ఇతర కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు. తాను వచ్చాక బిల్లులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చంద్రశేఖర్ రావు దెబ్బకు తెలంగాణ ప్రజలు నవాబులు కాదని, బికారులు అయ్యారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో పాటు అడ్డగోలుగా తప్పులు చేశారన్నారు. తాము 30 నెలల్లో అనేక సమస్యలు పరిష్కరించామన్నారు. విధ్వంసం అయిన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నట్లు తెలిపారు. తాను తప్పించుకు తిరగకుండా ప్రజల మధ్య ఉంటానని తెలిపారు.
Rythu Bharosa Funds | రైతు సంక్షేమం కోసం..
రైతులకు రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రైతుల విద్యుత్ బకాయిలు మాఫీ చేశామన్నారు. ప్రస్తుతం రైతులకు ఉచిత విద్యుత్ కోసం నెలకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సన్న వడ్లకు బోనస్ కింద రూ.4 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గారు 44.28 లక్షల మంది రైతులకు రూ.2,482 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు. pic.twitter.com/8kd22XJOIw
— TG Govt Updates (@TGGovtUpdates) June 30, 2026
దీనిని కూడా చదవండి : Tribal University Convocation | వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము