Rajiv Yuva Vikasam | నవంబర్ నుంచి ‘రాజీవ్ యువ వికాసం’ ప్రారంభం

రాజీవ్​ యువ వికాసం పథకాన్ని నవంబర్​ నుంచి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్​ నుంచి ఈ పథకం అమలు చేస్తామన్నారు.

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాజీవ్​ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా సబ్సిడీ లోన్ల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయలేదు. దీంతో ఆశావహులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నవంబర్​ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.

Rajiv Yuva Vikasam | బీసీ సంక్షేమానికి ప్రాధాన్యం

బీసీ సంక్షేమ (BC Welfare) పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌లో సోమవారం ఆయన బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను సైతం ఏ నెలకు ఆ నెల విద్యార్థుల అకౌంట్​లో జమ చేయాలని ఆదేశించారు.

Rajiv Yuva Vikasam | కాటమయ్య రక్షణ కవచాలు

గీత కార్మికుల సంక్షేమానికి ‘కాటమయ్య రక్షణ కవచాలు’ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 50 వేల మందికి కిట్స్ మంజూరు కాగా, 40 వేల కిట్లను అందించామన్నారు. మరో 10 వేల మందికి కూడా శిక్షణ పూర్తయ్యాక కాటమయ్య రక్షణ కవచం కిట్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకం కోసం మొత్తం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద 180 మంది విద్యార్థులకు రూ.18.40 కోట్లు విడుదల చేశామన్నారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి : Land Resurvey | గ్రామాల్లో రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం : మంత్రి పొంగులేటి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *