Land Resurvey | గ్రామాల్లో రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం : మంత్రి పొంగులేటి

గ్రామాల్లో రీ సర్వేతో భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Resurvey | గ్రామాల్లో రీ సర్వేతో భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వ‌న‌ప‌ర్తిలో సోమ‌వారం ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ధరణి (Dharani) పోర్టల్​లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పొంగులేటి పేర్కొన్నారు. దీంతో తాము దానిని తొలగించి, భూ భారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. రైతులకు భూధార్ కార్డులను అందించ‌డ‌మే ధ్యేయంగా ప్ర‌భుత్వం స‌ర్వే నిర్వ‌హిస్తోంద‌న్నారు. భూ భారతి (Bhu Bharati) కింద 70 రెవెన్యూ గ్రామాలను తొలి దశలో రీ సర్వేకు ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో నక్షాలు అందుబాటులో లేని సుమారు 413 రెవెన్యూ గ్రామాల్లో దశలవారీగా సర్వే చేస్తామని తెలిపారు.

Land Resurvey | ఆధునిక సాంకేతికతతో..

గ్రామాల్లో భూ సర్వేను వేగంగా పూర్తి చేయడానికి సాంకేతిక పరికరాలను కొనుగోలు చేశామన్నారు. రోవర్లతో పక్కాగా సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో మరిన్ని రోవర్లను కొనుగోలు చేస్తామని చెప్పారు. వేలాది మంది సర్వేయర్లకు లైసెన్సులు మంజూరు చేసి సర్వే వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దశాబ్దాలుగా సాగులో ఉన్నప్పటికీ సరైన టైటిల్‌ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని పొంగులేటి ఆదేశించారు.

Land Resurvey | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయగా.. ఇప్పటికే రెండు లక్షలకు పైగా ఇళ్లు పూర్తయినట్లు తెలిపారు. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మూడో విడత, నాలుగో విడతల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి : RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఆర్​ఐ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *