Power Cuts | తెలంగాణను చీకట్లోకి నెట్టిన కాంగ్రెస్​ : కేటీఆర్​

కాంగ్రెస్​ ప్రభుత్వం తెలంగాణను అంధకారంలోకి నెట్టిందని కేటీఆర్​ విమర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Power Cuts | కాంగ్రెస్​కు అధికారమిస్తే తెలంగాణ అంధకారమవుతుందని కేసీఆర్ చెప్పారని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) అన్నారు. ఆయన చెప్పినట్లే రాష్ట్రాన్ని కాంగ్రెస్​ పాలకులు చీకట్లోకి నెట్టారని విమర్శించారు.

గోదావరిఖనిలో సింగరేణి (Singareni) కార్మిక గర్జన సభలో బుధవారం కేటీఆర్​ మాట్లాడారు. రాష్ట్రంలో కరెంట్ కట్ (Power Cuts) సాధారణమైందన్నారు. పంటలకు నీరు అందక రైతులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని బాధపడుతున్నారని చెప్పారు. సింగరేణి నష్టాల బాటలో ఉందని సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Power Cuts | ప్రైవేట్ పరం చేసే కుట్ర

మూడేళ్ల కాంగ్రెస్‌ పాలనలో విద్యుత్ ఆగమైందని కేటీఆర్​ అన్నారు. కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంట్ పోయిందని ఎద్దేవా చేశారు. సింగరేణిని ప్రైవేట్‌ పరం చేసేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు. సింగరేణిలో సీఎం బావమరిది పెత్తనం నడుస్తోందన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ఏ ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదని విమర్శించారు. సింగరేణిలో ఇంత దోపిడీ జరుగుతుంటే కేంద్రంలో ఉన్న బొగ్గు శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

సింగరేణి ఉద్యమాల గడ్డ అని కేటీఆర్​ అన్నారు. కాంగ్రెసోళ్ల అవినీతి, అణచివేత భరించలేక ఒకనాడు తుపాకులతో తిరగబడ్డది ఈ కోల్ బెల్ట్ అని గుర్తు చేశారు. కేసీఆర్​ పిలుపు మేరకు కార్మికులు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలన్నారు.

 

దీనిని కూడా చదవండి : Indiramma Houses | ఏడాదిలోపు ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *