అక్షరటుడే వెబ్డెస్క్: Tata Power Data Centres | భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ , డిజిటల్ డేటా సెంటర్ రంగానికి అవసరమైన విద్యుత్ సౌకర్యాలను అందించడంలో ‘టాటా పవర్’ కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. దేశంలో అత్యుత్తమ స్థానంలో ఉన్న 18 ప్రముఖ డేటా సెంటర్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్న సంస్థ, ఏకంగా 2.8 గిగావాట్లకు పైగా సామర్థ్యంతో కూడిన ప్రాజెక్ట్ అవకాశాలను దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
Tata Power Data Centres | 29 యాక్టివ్ ప్రాజెక్టులతో ..
టాటా పవర్ కేవలం విద్యుత్ సరఫరాకే పరిమితం కాకుండా డేటా సెంటర్ల స్థాపనకు అవసరమైన ల్యాండ్, గ్రిడ్ కనెక్టివిటీ, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, కూలింగ్ సిస్టమ్స్ , యుటిలిటీ మౌలిక వసతులను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా 430 మెగావాట్ల విద్యుత్ పంపిణీ నెట్వర్క్, 1,236 మెగావాట్ల ట్రాన్స్మిషన్ ఆప్షన్లు, 1,150 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 29 వర్క్స్ట్రీమ్లపై నిరంతరం శ్రమిస్తోంది.
Tata Power Data Centres | ముంబై గ్రిడ్ ఆధునీకరణ..
ముంబై ( Mumbai ) మహానగర ప్రాంతంలో హ్యైపర్స్కేల్ డేటా సెంటర్ల నుంచి వచ్చే భారీ విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడానికి టాటా పవర్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ‘రూ. 15,000 కోట్ల ముంబై గ్రిడ్ అప్గ్రేడేషన్ & ఎక్స్పాన్షన్ ప్లాన్’ ద్వారా తన 110 కేవీ, 220 కేవీ నెట్వర్క్ను ఆధునీకరించడంతో పాటు, కొత్త రిసీవింగ్ స్టేషన్లు , 400 కేవీ ట్రాన్స్మిషన్ రింగ్ నెట్వర్క్ను నిర్మిస్తోంది.
Tata Power Data Centres | నిరంతర విద్యుత్..
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, ఏఐ ఆధారిత డేటా సెంటర్ల వలన 2031-32 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో అదనంగా 26.3 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం , పంపిణీ రంగాలలో దశాబ్దాల అనుభవం ఉన్న టాటా పవర్, ఈ పెరుగుతున్న అవసరాలకు తగినట్టుగా నిరంతర, సుస్థిర గ్రీన్ ఎనర్జీని అందించేందుకు పూర్తి సన్నద్ధంగా ఉంది.
ఇది కూడా చదవండి: Vangaveeti Radha | జనసేనలో చేరిన వంగవీటి రాధా