Lumino Industries IPO | భారీగా జీఎంపీ.. ఈపీసీ కంపెనీ ఐపీవోపై లుక్కేయండి

పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఈపీసీ కంపెనీ అయిన లూమినో ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. 73 శాతం లిస్టింగ్ గెయిన్స్‌ను జీఎంపీ సూచిస్తోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lumino Industries IPO | లూమినో ఇండస్ట్రీస్ లిమిటెడ్(Lumino Industries) కంపెనీని 2005లో స్థాపించారు. ఇది కండక్టర్లు, పవర్ కేబుల్స్, ఎలక్ట్రికల్ వైర్లు మరియు ప్రత్యేక భాగాల తయారీ, సరఫరాలో నిమగ్నమై ఉన్న ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ మరియు కన్‌స్ట్రక్షన్ (EPC) కంపెనీ. ఈ సంస్థ పంపిణీ మరియు ప్రసార లైన్‌ల కోసం అధిక ఉష్ణోగ్రత, తక్కువ సాగ్ (హెచ్టీఎలఎస్ ) కండక్టర్లను తయారు చేస్తూ కండక్టర్లు, పవర్ కేబుల్స్ మరియు ఈపీసీ పరిశ్రమలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా నిలిచింది.

Lumino Industries IPO | విదేశాలకు సైతం..

లూమినో ఇండస్ట్రీస్‌కు పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో 2 తయారీ కేంద్రాలున్నాయి. యూఎస్, నేపాల్, ఘనా వంటి దేశాలలోని ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ కంపెనీలతో సహా అంతర్జాతీయ క్లయింట్‌లకు తన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

Lumino Industries IPO | రూ. 700 కోట్ల ఐపీవో..

ఈ కంపెనీ ఐపీవో (IPO) ద్వారా మొత్తం రూ. 700 కోట్లు సమీకరించనుంది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 5 ఫేస్ వ్యాల్యూ కలిగిన 6,09,75,609 షేర్లశ్రీఱ విక్రయించి రూ. 500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 5 ఫేస్ వ్యాల్యూ కలిగిన 2,43,90,242 షేర్లను విక్రయించడం ద్వారా మరో రూ. 200 కోట్లు సమీకరించనున్నారు. ఈ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, రుణాల చెల్లింపు కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రైస్ బ్యాండ్ : కంపెనీ షేర్ల ధరల శ్రేణిని రూ. 78 నుంచి రూ. 82 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 182 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,924 తో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

కోటా : క్యూఐబీలకు 50 శాతం వాటా, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటా, ఎన్ ఐఐలకు 15 శాతం వాటాను కంపెనీ కేటాయించింది.

జీఎంపీ : లూమినో ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 60 ఉంది. అంటే ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలో 73 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు..

ఆగస్టు 27న ఓపెన్ అయిన ఐపీవో.. ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉండనుంది.
సెప్టెంబర్ 01న షేర్స్ అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
కంపెనీ షేర్లు సెప్టెంబర్ 03న బీఎస్ ఈ, ఎన్ ఎస్ ఈలలో లిస్ట్ కానున్నాయి.

ఇది కూడా చదవండి..: Lava Bold N4 Lite | రూ. 8 వేలకే స్మార్ట్ ఫోన్.. సెప్టెంబర్ 3 నుంచి సేల్ ప్రారంభం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *