Rahul Gandhi FIR Demand | వారిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలి : రాహుల్ గాంధీ

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gandhi FIR Demand | కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్​లోని హల్ద్వానిలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత, ఆ స్థలాన్ని ‘శుద్ధి’ చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్​ చేశారు.

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో శనివారం రాహుల్​ గాంధీ మాట్లాడారు. ఖర్గే (Mallikarjuna Kharge) మాట్లాడిన స్థలాన్ని శుద్ధి చేయడాన్ని రాజ్యాంగం, ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ భావజాలాల మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. తన పార్టీ అధ్యక్షుడికి న్యాయం జరగాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. ఆ ‘శుద్ధి’ కార్యక్రమం నిర్వహించిన వారిపై వీలైనంత త్వరగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు.

Rahul Gandhi FIR Demand | ప్రధాని మాట్లాడాలి

తాను అన్ని కులాలకు చెందినవాడినని ప్రధాని చెబుతారని రాహుల్ అన్నారు. కానీ ఉత్తరాఖండ్‌లో బీజేపీ చీఫ్ మాత్రం ఆ ‘శుద్ధి’ చర్య సరైనదేనని సమర్థించారని మండిపడ్డారు. ఇది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మనస్తత్వాన్ని బయటపెడుతోందన్నారు. ఒక దళితుడు ఆర్థికంగా ఎదగడం, గౌరవప్రదంగా జీవించడం వారికి ఇష్టం లేదన్నారు. ఉత్తరాఖండ్​ బీజేపీ అధ్యక్షుడు ఆ కార్యక్రమాన్ని సమర్థించి, చట్టవిరుద్ధమైన పని చేసినా.. ప్రధాని మాట్లాడకపోవడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ఒక ఆలయాన్ని సందర్శించిన తర్వాత కూడా ఇలాంటి ‘శుద్ధి’ కార్యక్రమం జరిగిందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: FDA Food Check | లంచం ఆరోపణలు.. ఎఫ్‌డీఏ అధికారికి ఎక్స్‌పైరీ బిస్కెట్లు తినిపించే యత్నం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *