అక్షరటుడే వెబ్‌డెస్క్: TGTET In-Service 2026 | తెలంగాణలో ( Telangana )ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న టెట్ (TGTET In-Service 2026) పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆన్లైన్ (CBT) విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 24,983 మంది ఉపాధ్యాయులు హాజరుకానున్నారు.
TGTET In-Service 2026 | పరీక్షల షెడ్యూల్ వివరాలు..
తెలంగాణలో జరగనున్న TGTET ఇన్-సర్వీస్ పరీక్షల షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 8న ఉదయం 9:00 గంటల నుండి 11:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష 23 కేంద్రాల్లో 5,963 మంది అభ్యర్థులకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2:00 గంటల నుండి 4:30 గంటల వరకు గణితం-సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల పేపర్-2 పరీక్ష అత్యధికంగా 15,071 మంది ఉపాధ్యాయుల కోసం జరుగనుంది. అలాగే సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 2:00 గంటల నుండి 4:30 గంటల వరకు రెండవ విడత పేపర్-2 పరీక్ష 3,949 మంది అభ్యర్థులకు నిర్వహించనుండగా, ఈ మొత్తం పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 42 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
TGTET In-Service 2026 | హాల్ టికెట్లు, వెబ్సైట్ వివరాలు..
పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి టైమ్‌టేబుల్, హాల్ టికెట్లు , ఇతర అప్డేట్ల కోసం అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Lumino Industries IPO | భారీగా జీఎంపీ.. ఈపీసీ కంపెనీ ఐపీవోపై లుక్కేయండి