అక్షరటుడే వెబ్‌డెస్క్: HYDRA Commissioner Ranganath | హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ( Telangana High Court )ఊరట లభించింది. ఆయనను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
HYDRA Commissioner Ranganath | సింగిల్ బెంచ్ ఆదేశాలు ..
హైడ్రా బాధ్యతల నుంచి రంగనాథ్‌ను తప్పుకోవాలని, ఆ స్థానంలో డీజీ హోదా ఉన్న అధికారికని నియమించాలని సింగిల్ బెంచ్ గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కమిషనర్ రంగనాథ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం సింగిల్ బెంచ్ ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చింది.
HYDRA Commissioner Ranganath | యథావిధిగా హైడ్రా విధులు..
డివిజన్ బెంచ్ నిర్ణయంతో రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా కొనసాగడానికి మార్గం సుగమమైంది. ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణను నవంబర్ 3కి కోర్టు వాయిదా వేసింది. ఈ తీర్పుతో నగరంలో చెరువుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు చర్యలు యథావిధిగా కొనసాగనున్నాయి.
ఇది కూడా చదవండి: Student Protest FIRs | నిరసనకారులపై కేసులు కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఆందోళన విరమించిన సీజేపీ