RIMS Accident | రిమ్స్‌ ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య.. మరో 20 మంది నవజాత శిశువుల పరిస్థితి విషమం!

ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆసుపత్రిలోని భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: RIMS Accident | ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో మృతి చెందిన నవజాత శిశువుల సంఖ్య ఐదుకు చేరింది. మరో 20 మంది శిశువుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.

RIMS Accident | భద్రతా ప్రమాణాలపై అనుమానాలు

ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో అగ్నిప్రమాద హెచ్చరిక వ్యవస్థలు, భద్రతా పరికరాలు సమర్థంగా పనిచేశాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది అందుబాటులో ఉన్నారా? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది.

Balakrishna | అమెరికా–ఇరాన్​ యుద్ధంలోకి ‘బాలయ్య’!

ప్రమాద సమయంలో ఆసుపత్రిలో ఒక్క డాక్టర్‌ మాత్రమే ఉన్నారని బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శిశువులను తరలించేందుకు చేపట్టిన సహాయక చర్యలపైనా కుటుంబ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆసుపత్రిలోని భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.

RIMS Accident | పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నేతలు

ప్రమాద ఘటనపై స్పందించిన బీఆర్‌ఎస్‌ నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని వారు డిమాండ్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఘటనపై స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రమాదానికి కారణాలు, ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

RIMS Accident | సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్‌

రిమ్స్‌లో నవజాత శిశువుల మృతిపై మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్‌, ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లు, అగ్నిప్రమాద నివారణ చర్యలు, ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

శిశువుల మరణానికి దారితీసిన కారణాలు, ఆసుపత్రిలో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యలకు సంబంధించిన వివరాలను నివేదికలో పొందుపరచాలని కమిషన్‌ ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటనపై తదుపరి చర్యలు విచారణ నివేదిక ఆధారంగా ఉండనున్నాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *