అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lift Irrigation | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో చేపట్టిన సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. మోటార్లు ఆన్ చేసి సాగునీరు విడుదల చేశారు.
సీతారామ మారెళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని రూ.610 కోట్లతో చేపట్టారు. ఇందులో భాగంంగా గోదావరి జలాలను తుమ్మల చెరువులోకి విడుదల చేశారు. దీంతో 4300 ఎకరాల సాగునీరు అందనుందని మంత్రులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌తో దశలవారీగా అశ్వాపురం మండలంలో 22 నుంచి 23 వేల ఎకరాలకు సాగునీరు నీరు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో దీనిని పట్టించుకోలేదని విమర్శించారు. అసంపూర్తిగా ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చేపట్టిందని తెలిపారు.
Lift Irrigation | నిధులు మంజూరు చేస్తాం
దొమ్మలవాగు రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేసి, టెండర్లు పిలుస్తామని పొంగులేటి అన్నారు. రేకులగండి ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పులుసుబొంత ప్రాజెక్టు భూసేకరణ, అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : The Paradise Movie | నానికి పోలీసుల షాక్.. సినిమా చూసేందుకు అనుమతి నిరాకరణ