Balakrishna | అమెరికా–ఇరాన్​ యుద్ధంలోకి ‘బాలయ్య’!

అమెరికా–ఇరాన్​ యుద్ధం వేళ బాలకృష్ణ నటించిన ఓ సినిమా సన్నివేశాన్ని ఇరాన్​ ఎంబసీ ట్వీట్​ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna | అమెరికా–ఇరాన్​ (America-Iran) మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అంతేగాకుండా రెండు దేశాలు మాటలు, ట్వీట్​ల రూపంలో సైతం యుద్ధం చేస్తున్నాయి. ట్వీట్​ వార్​లోకి తాజాగా తెలుగు హీరో బాలకృష్ణ (Balakrishna ) వెళ్లడం గమనార్హం.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ పలుమార్లు ఇరాన్​ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ దేశాన్ని నాశనం చేస్తానని పేర్కొన్నారు. ఇటీవల మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జింబాబ్వేలోని ఇరాన్​ ఎంబసీ వ్యంగ్యంగా ఓ ట్వీట్​ చేసింది. ట్రంప్ ఇరాన్‌ను నాశనం చేయడం గురించి మాట్లాడుతున్నారని, కానీ ఇరాన్ నిస్సహాయమైనది కాదని ఆయనకు తెలుసు అని పేర్కొంది. ట్రంప్​ ఈ మధ్య హాలీవుడ్‌కు బదులుగా బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు బాలకృష్ణ నటించిన భగవంత్​ కేసరి (Bhagavanth Kesari)  సినిమాలోని ఓ ఫైట్​ సీన్​ను పోస్ట్​ చేసింది. దీంతో బాలయ్య తన ప్రమేయం లేకుండానే ఇరాన్​–అమెరికా ట్వీట్​ వార్​లో చేరారు.

Balakrishna | టాలీవుడ్​ నుంచి..

బాలకృష్ణ నటించిన భగవంత్​ కేసరి సూపర్​ హిట్ అయింది. ఆ సినిమా హిందీలో డబ్​ చేశారు. దీంతో ఇరాన్​ ఎంబసీ బాలీవుడ్​ చిత్రం అని పోస్ట్​ చేసింది. టెహ్రాన్ కూడా ఏమాత్రం నిస్సహాయంగా లేదని సూచించడానికి, బాలకృష్ణ నటించిన ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాన్ని ఉపయోగించి, వ్యంగ్యపూరితమైన పోస్ట్ చేసింది. అనిల్ రవిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా 2023లో రిలీజ్​ అయింది. ఇరాన్ మీమ్ బాలీవుడ్ నుండి కాదు, తెలుగు సినిమా నుండే స్వీకరించింది.

 

 

దీనిని కూడా చదవండి : The Paradise Movie | నానికి పోలీసుల షాక్​.. సినిమా చూసేందుకు అనుమతి నిరాకరణ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *