Johnny Shekar Clash | శేఖర్​, జానీ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ

కొరియోగ్రాఫర్లు జానీ, శేఖర్‌ మాస్టర్‌ గ్రూప్స్‌ మధ్య ఘర్షణ నెలకొంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Johnny Shekar Clash | కొరియోగ్రాఫర్లు జానీ, శేఖర్‌ మాస్టర్‌ గ్రూప్స్‌ మధ్య ఘర్షణ నెలకొంది. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్‌ అసోసియేషన్‌లో ఎన్నికలు, సభ్యత్వ అంశాల్లో వాగ్వాదం చోటు చేసుకుంది.

అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలతపై డ్యాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ విషయంలో ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫెడరేషన్​ అనుమతి లేకుండా ఆదివారం బై ఎలక్షన్స్​ నిర్వహించడంపై శేఖర్​ మాస్టర్​ వర్గం వారు ఆందోళన చేశారు. ఈ క్రమంలో జానీ మాస్టర్​, శేఖర్​ మాస్టర్​ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుమలత తీరుకు నిరసనగా 10 మంది డ్యాన్సర్లు పదవులకు రాజీనామా చేశారు.

Johnny Shekar Clash | ఠాణాకు చేరిన పంచాయితీ

ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూపుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఈ గొడవ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినట్లు సమాచారం. కాగా డ్యాన్సర్ల అసోసియేషన్​లో కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఆదివారం బై ఎలక్షన్స్​ సమయంలో అవి బయటపడ్డాయి. సుమలత అసోసియేషన్‌లో రూల్స్ అతిక్రమిస్తున్నారని పలువురు డ్యాన్సర్లు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు. ఫెడరేషన్​ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. లేకపోవతే భవిష్యత్తులో డ్యాన్సర్లకు ఇబ్బందులు వస్తాయన్నారు.

దీనిని కూడా చదవండి : Jaggareddy Comments | రక్తం చిందించే ధైర్యం హరీశ్​రావుకు లేదు : జగ్గారెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *