అక్షరటుడే, వెబ్‌డెస్క్: Peddi Special Song | టాలీవుడ్ (Tollywood)లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది (Peddi) సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్పెషల్ సాంగ్‌పై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదటగా మృణాల్ ఠాకూర్, మానస వారణాసి, సంయుక్త మీనన్ వంటి పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే చివరకు మేకర్స్ శృతి హాసన్ ని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్‌లో బలంగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే, రామ్ చరణ్ – శృతి హాసన్ కాంబో మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది.
Peddi Special Song | ‘ఎవడు’ తర్వాత మళ్లీ ..
రామ్ చరణ్, శృతి హాసన్ (Sruthi Hassan) గతంలో ఎవడు సినిమాలో కలిసి నటించి మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ ద్వారా మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు కావడంతో, ఈ పాటలో డ్యాన్స్ హైలైట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) కావడం విశేషం. ఆయన స్వరపరిచే ఈ స్పెషల్ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. అలాగే బుచ్చిబాబు మేకింగ్ స్టైల్, విజువల్ ప్రెజెంటేషన్ ఈ పాటను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Peddi Special Song | హీరోయిన్‌గా జాన్వీ కపూర్
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ తారాగణం వల్ల ‘పెద్ది’ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఇంపాక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేసి, స్పెషల్ సాంగ్ చిత్రీకరణను కూడా త్వరలో ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రంతో రామ్ చరణ్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి..: Allu Arjun new house | చిరంజీవి ఇంటికి దగ్గరలో ఖరీదైన ఇల్లు నిర్మిస్తున్న అల్లు అర్జున్.. ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లపెడతారు..!

