Allu Arjun new house | చిరంజీవి ఇంటికి ద‌గ్గ‌ర‌లో ఖ‌రీదైన ఇల్లు నిర్మిస్తున్న‌ అల్లు అర్జున్.. ఖ‌రీదెంతో తెలిస్తే నోరెళ్ల‌పెడ‌తారు..!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun new house | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమాల వల్ల కాదు… ఆయన నిర్మిస్తున్న అద్భుతమైన డ్రీమ్ హౌస్‌తో. హైదరాబాద్‌ (Hyderabad)లోని అత్యంత కాస్ట్‌లీ ఏరియా అయిన‌ జూబ్లీహిల్స్‌లో ఆయన ఒక భారీ మేన్షన్ నిర్మిస్తున్నట్లు సమాచారం.

సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మేన్షన్ దాదాపు 4 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండగా, ఈ ఇంటిని అత్యాధునిక సదుపాయాలతో డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రైవసీ, భద్రతతో పాటు లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ప్రతిబింబించేలా ఈ ఇంటి ప్లాన్ రూపొందించబడిందని సమాచారం.

Allu Arjun new house | రూ.80 కోట్ల భారీ బడ్జెట్

ఈ మేన్షన్ నిర్మాణానికి సుమారు రూ.80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇంటీరియర్స్ నుంచి ఎక్స్‌టీరియర్స్ వరకు ప్రతి అంశంలో హైఎండ్ క్వాలిటీని పాటిస్తూ, ప్రపంచ స్థాయి డిజైన్‌లను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ (Hollywood) స్టైల్ విల్లాలను తలపించేలా ఈ ఇంటిని తీర్చిదిద్దుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కొత్త మేన్షన్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నివాసానికి సమీపంలో ఉండటం విశేషం. ఇప్పటికే ఆ ప్రాంతం టాలీవుడ్ ప్రముఖుల నివాసాలతో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే ప్రాంతంలో తన డ్రీమ్ హౌస్ నిర్మించుకోవడం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.

Allu Arjun new house

Allu Arjun new house | ఈ ఏడాది చివర్లో గృహప్రవేశం

ఈ ఇంటిలో స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ థియేటర్, జిమ్, గార్డెన్ ఏరియా, హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పేస్‌లు కూడా ఇందులో భాగమవుతున్నాయి. నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయ‌ని తెలుస్తుండ‌గా, ఈ ఏడాది చివర్లో గృహప్రవేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ వేడుక‌కి టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ త్వ‌ర‌లోనే రానుంది.

ఇది కూడా చదవండి..: Chitti Babu Death | టాలీవుడ్‌లో తీవ్ర‌ విషాదం: నటుడు, నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *