Kangana Ranaut Ramdev | రామ్‌దేవ్‌ అన్నయ్య.. విమర్శలకు చెక్‌ పెట్టిన కంగన

‘‘రాఖీ సందర్భంగా సిస్టర్‌ కంగనకు స్వీట్లు, గిఫ్ట్‌ పంపిస్తున్నాను. దేశంలో ద్వేషానికి చోటు లేదు. ఎలాంటి వివాదం ఉన్నా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’’ అని పేర్కొన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kangana Ranaut Ramdev | గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న మాటల యుద్ధానికి యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా, బాలీవుడ్‌ నటి, ఎంపీ కంగన రనౌత్‌ ముగింపు పలికారు. రాఖీ పండగ సందర్భంగా ఒకరిపై మరొకరు సానుకూలంగా స్పందిస్తూ వివాదానికి తెరదించారు.

రాఖీ సందర్భంగా కంగనకు శుభాకాంక్షలు తెలిపిన రామ్‌దేవ్‌ బాబా.. ఆమెను ‘సిస్టర్‌ కంగన’గా సంబోధించారు. ‘‘రాఖీ సందర్భంగా సిస్టర్‌ కంగనకు స్వీట్లు, గిఫ్ట్‌ పంపిస్తున్నాను. దేశంలో ద్వేషానికి చోటు లేదు. ఎలాంటి వివాదం ఉన్నా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’’ అని పేర్కొన్నారు.

Kangana Ranaut Ramdev | సోషల్​ మీడియా వేదికగా..

దీనిపై కంగన కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘‘పండగలు ఉన్నదే తప్పులను మర్చిపోవడానికి. అన్నయ్యగా రామ్‌దేవ్‌ పంపిన ప్రేమను, స్వీట్లను స్వీకరిస్తున్నా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

CBI Bribery Case | రూ.40 లక్షల లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన జీఎస్​టీ అధికారులు

ఇరువురి తాజా స్పందనలతో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికినట్లయింది. రాఖీ పండగ సందర్భంగా పరస్పరం ప్రేమాభిమానాలు చాటుకోవడం ద్వారా విమర్శలకు చెక్‌ పెట్టారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *