అక్షరటుడే, వెబ్‌డెస్క్: Goods Train Derailment | ఘజియాబాద్-న్యూ ఢిల్లీ (New Delhi) సెక్షన్ మధ్య సరుకులతో వెళ్తున్న ఒక గూడ్స్ రైలు మంగళవారం ఉదయం పట్టాలు తప్పింది. ఆరు బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని రైల్వే అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు, ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
Goods Train Derailment | రంగంలోకి రైల్వే సిబ్బంది
ఘటన జరిగిన వెంటనే సీనియర్ రైల్వే అధికారులు పరిస్థితిని అంచనా వేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీలైనంత త్వరగా రైళ్లను పునరుద్ధరించడానికి ట్రాక్‌కు మరమ్మతు చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించడానికి రైల్వే సాంకేతిక మరియు సహాయక బృందాలను వెంటనే రంగంలోకి దించారు.
Goods Train Derailment | 53 రైళ్లపై ప్రభావం
ప్రమాదం కారణంగా, ఘజియాబాద్, సాహిబాబాద్, ఢిల్లీ – న్యూ ఢిల్లీ మధ్య నడిచే అనేక లోకల్ రైళ్లు రద్దు చేయబడ్డాయి. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 53 రైళ్లపై ప్రభావం పడింది. 24 రైళ్లను ఢిల్లీ-న్యూఢిల్లీ మార్గం మీదుగా మళ్లించగా, 16 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. మరో ఐదు ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మొరాదాబాద్ డివిజన్ మరియు నార్త్ సెంట్రల్ రైల్వే మార్గాల ద్వారా ఆనంద్ విహార్ వెళ్లే రైళ్లతో సహా ఎనిమిది రైళ్లను నియంత్రించారు.
ఇది కూడా చదవండి..: Jammu Kashmir Landslide | విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురి మృతి