అక్షరటుడే, వెబ్డెస్క్ : Jammu Kashmir Landslide | జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలకు ఆకస్మిక వరదలు తలెత్తి కొండచరియలు విరిగిపడుతున్నాయి. పూంచ్ జిల్లాలో సోమవారం ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మృతి చెందారు.
లోరాన్ గ్రామంలోని ఎత్తైన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఆ ఇల్లు మట్టితో నిర్మించబడిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణించిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారని వారు తెలిపారు. శనివారం సాయంత్రం నుండి పూంచ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు.
Jammu Kashmir Landslide | అతలాకుతలం
భారీ వర్షాలతో జమ్మూ కశ్మీర్లోని జన జీవనం అతలాకుతలం అవుతోంది. వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో అమర్నాథ్ (Amarnath Yatra) యాత్రను అధికారులను నిలిపివేశారు. ఇటీవల వరదలకు వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోయాయి. ప్రభుత్వం వరద బాధితులను పునరావస కేంద్రాలకు తరలిస్తోంది.
దీనిని కూడా చదవండి : Traffic Restrictions | నగరవాసులకు అలెర్ట్.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు