అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Oath Confusion | తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీపై స్పష్టత లేకపోవడంతో టీవీకే అధినేత, నటుడు విజయ్ ప్రమాణస్వీకారంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.
గవర్నర్‌కు అవసరమైన మద్దతు లేఖలు పూర్తిస్థాయిలో అందకపోవడంతో ప్రమాణస్వీకారానికి అనుమతి ఇవ్వలేదని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Vijay Oath Confusion | టీవీకే కూటమి బలం 116
తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, ప్రస్తుతం టీవీకే Tamilaga Vettri Kazhagam కూటమి బలం 116 వద్దే నిలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరమణి నేతృత్వంలోని VCK, అలాగే IUML పార్టీల మద్దతు లేఖలు ఇంకా రాజ్‌భవన్‌కు చేరలేదని సమాచారం. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకోవడంలో ఇంకా జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.
ఇప్పటిదాకా గవర్నర్‌కు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి మాత్రమే అధికారిక మద్దతు లేఖలు అందినట్లు సమాచారం. అయితే మెజార్టీ నిరూపణకు అవసరమైన సంఖ్య పూర్తికాకపోవడంతో గవర్నర్ ఇంకా వేచి చూస్తున్నట్లు సమాచారం.
Vijay Oath Confusion | ప్రతిపక్షాల విమర్శలు
ఇక విజయ్ ప్రమాణస్వీకారంపై అభిమానులు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు మెజార్టీ స్పష్టత లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
తమిళనాడు రాష్ట్ర రాజకీయ పరిణామాలు గంట గంటకూ మారుతున్న నేపథ్యంలో.. VCK, IUML మద్దతు లేఖలు ఎప్పుడు అందుతాయనేది ఇప్పుడు కీలకంగా మారింది. గవర్నర్ తదుపరి ఏమి నిర్ణయం తీసుకుంటారా… అని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Vijay Thalapathy | దళపతి @ జననేత.. తమిళనాడు రాజకీయాల్లో ‘విజయ్’ శకం మొదలు!

