Modi US Visit | డిసెంబర్​లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్​లో అమెరికాలో పర్యటించన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Modi US Visit | ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్​లో అమెరికాలో పర్యటించన్నారు. ద్వైపాక్షిక చర్చల కోసం ఆయన అగ్రరాజ్యంతో పాటు కెనడా, యూరప్​లను సందర్శిస్తారు.

ఆయా దేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ (PM Modi) పర్యటన సాగనుంది. పర్యటనలో వాణిజ్య ఒప్పందాలు ప్రధాన అజెండాగా ఉండే అవకాశం ఉంది. మోదీ జర్మనీ పర్యటన బెర్లిన్ సందర్శనతో మొదలు కానుంది. అనంతరం ఆయన అమెరికాకు వెళ్తారని సమాచారం. ఫ్లోరిడాలో డిసెంబర్ 14-15 తేదీలలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సమావేశంలో ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్​తో ద్వైపాక్షిక చర్చలు సైతం జరిపే అవకాశం ఉంది.

Modi US Visit | వాణిజ్య చర్చలు

మోదీ, ట్రంప్‌ల మధ్య జరిగే ద్వైపాక్షిక సమావేశంలో వాణిజ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం ముగింపుపై ఇంకా అనిశ్చితి నెలకొని ఉంది. ఇటీవల అమెరికా కొత్త చట్టం తెచ్చి రష్యా నుంచి ఆయిల్​ కొంటున్న దేశాలపై 100 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో డిసెంబర్​లో జరిగే వీరి భేటీపై ఉత్కంఠ నెలకొంది. కాగా ప్రధాని మోదీ, ట్రంప్ చివరిసారిగా జూన్ 17న ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భేటీ అయ్యారు.

ఇది కూడా చదవండి..: Asian Games Shooting | ఆసియా గేమ్స్​.. షూటింగ్​లో భారత్​కు మరో రెండు పతకాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *