అక్షరటుడే, వెబ్డెస్క్: SS Retail IPO | మొబైల్ ఫోన్లు, ప్రీ ఓన్డ్ స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీలు, టెలివిజన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు టాబ్లెట్‌లతో పాటు, మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌లు, ఈఎంఐ సౌకర్యాలు, యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్ మరియు మొబైల్ రీచార్జ్ వంటి అనుబంధ సేవలు అందించే ఎస్ఎస్ రిటైల్ కంపెనీ ఐపీవోకు వచ్చింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 500.75 కోట్లు సమీకరించింది.
SS Retail IPO | భారీ స్పందన..
ఈ ఐపీవో (IPO)కు ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 107.41 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 214.22 రెట్లు, ఎన్ ఐఐ కోటా 150.33 రెట్లు, రిటైల్ కోటా 35.81 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.
జీఎంపీకి మించి లాభాలు..
కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ కనిపించింది. అయితే ఇన్వెస్టర్లకు జీఎంపీకి మించి లాభాలను అందించింది. కంపెనీ షేర్లకు జీఎంపీ 38 శాతం ఉండగా.. బుధవారం స్టాక్ మార్కెట్‌లో 47.17 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో షేరును రూ. 424 కు విక్రయించగా.. రూ. 200 లాభంతో రూ. 624 వద్ద లిస్టయ్యింది. ఉదయం 11.20 గంటల సమయంలో 48 శాతం ప్రీమియంతో రూ. 629 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి..: JSW Ampstar EV | ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల రంగంలోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ .. ‘యాంప్‌స్టార్’ బ్రాండ్ ఆవిష్కరణ