Indian Stock Market | లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల బాటలో సాగుతోంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 368 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market | అమెరికా -ఇరాన్ యుద్ధానికి దౌత్యపరమైన పరిష్కారం లభిస్తుందనే ఆశలకుతోడు సౌదీ అరేబియా ముడి చమురు సరఫరాను పునరుద్ధరించడంతో క్రూడ్ ఆయిల్ ధరలు శాంతిస్తున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లనుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తోంది.

Indian Stock Market | లాభాలతో ప్రారంభం..

దేశీయ మార్కెట్లు (Domestic markets) బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో ఒడిదుడుకులకు లోనై 49 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 297 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో ప్రారంభమై 3 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 92 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 368 పాయింట్ల లాభంతో 74,897 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 23,441 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 24 స్టాక్స్ లాభాలతో, 6 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 2.46 శాతం, టాటా స్టీల్ 1.95 శాతం, ఎల్టీ 1.39 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.32 శాతం, ఐటీసీ 1.28 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టీసీఎస్ 0.62 శాతం, ఇన్ఫోసిస్ 0.59 శాతం, టైటాన్ 0.31 శాతం, ఎం అండ్ ఎం 0.20 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.16 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: SS Retail IPO | ఎస్ఎస్ రిటైల్.. బంపర్ లిస్టింగ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *