అక్షరటుడే వెబ్‌డెస్క్: NIMS ACB Case | నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఆయన్ను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు ( Chanchalguda Jail )తరలించారు.
NIMS ACB Case | బయటపడ్డ అక్రమాలు..
నిమ్స్‌లో తన ఉన్నతాధికారి హోదాను అడ్డం పెట్టుకుని భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారన్న పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. డాక్టర్ లక్ష్మీభాస్కర్‌తో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన సుమారు 7 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాలలో పెద్ద ఎత్తున కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.100 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులను గుర్తించారు. నిమ్స్‌లో కొనుగోళ్లు, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడే ఈ ఆస్తులను కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
NIMS ACB Case | మరింత లోతుగా దర్యాప్తు..
బినామీల పేర్లపై ఉన్న పలు బ్యాంకు ఖాతాలు, లాకర్లను తెరిచి పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Indian Stock Market | లాభాల్లో సూచీలు