అక్షరటుడే వెబ్‌డెస్క్: Schneider Electric Services Express | గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ దిగ్గజమైన ష్నైడర్ ఎలక్ట్రిక్ దక్షిణాదిలో ‘సర్వీసెస్ ఎక్స్‌ప్రెస్’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా మొబైల్ సర్వీస్ ఇన్నోవేషన్ హబ్‌ను సుమారు 120 రోజులకు పైగా 5 రాష్ట్రాలు, 20కి పైగా నగరాల్లో పర్యటించేలా రూపకల్పన చేశారు. బెంగళూరు ( Bengaluru )వేదికగా ప్రారంభమైన ఈ ప్రత్యేక చొరవ ద్వారా.. పారిశ్రామిక మార్కెట్లకు అత్యాధునిక సాంకేతికతలను, సేవా నైపుణ్యాలను మరింత చేరువ చేయనున్నారు. ముఖ్యమైన ఎలక్ట్రికల్ పరికరాల కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత మానిటరింగ్, కండిషన్-బేస్డ్ మెయింటెనెన్స్ , లైఫ్‌సైకిల్ సొల్యూషన్స్‌కు సంబంధించిన లైవ్ డెమోలను ఈ హబ్ ప్రదర్శించనుంది.
Schneider Electric Services Express | ఏఐ సాంకేతికత..
బెంగళూరులో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ దామిని చౌదరి మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగానికి డిజిటల్ సేవలను మరింత దగ్గర చేయడానికి ‘సర్వీసెస్ ఎక్స్‌ప్రెస్’ అద్భుత వేదికగా నిలుస్తుందని తెలిపారు. కండిషన్-బేస్డ్ మెయింటెనెన్స్, డిజిటల్ మానిటరింగ్ ద్వారా ఎలక్ట్రికల్ అసెట్లను మరింత మెరుగ్గా నిర్వహించడం, సిస్టమ్ విశ్వసనీయతను పెంచడం, అనుకోకుండా జరిగే పవర్ కట్స్ లేదా అంతరాయాలను తగ్గించడం తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
Schneider Electric Services Express | ఐదు రాష్ట్రాల్లో పర్యటన..
ఈ సర్వీసెస్ ఎక్స్‌ప్రెస్ హబ్ ప్రధానంగా డేటా సెంటర్లు, వివిధ పరిశ్రమలు, భవనాలు, గ్రిడ్లకు అవసరమైన టెక్నాలజీలను ఒకే చోట అందిస్తుంది. ఎలక్ట్రికల్ పరికరాల జీవితకాలం పొడిగించేందుకు వాటిని ఎలా అప్‌గ్రేడ్ చేయాలో ఇది వివరిస్తుంది. ఈ మొబైల్ ఫార్మాట్ నేరుగా పారిశ్రామిక క్లస్టర్ల వద్దకే వెళ్లనుండటంతో.. స్థానిక సంస్థలకు, నిపుణులకు టెక్నాలజీని ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం లభిస్తుంది. కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన పారిశ్రామిక నగరాలను ఈ హబ్ కవర్ చేయనుంది.
ఇది కూడా చదవండి: BC Commission Visit | 7న నిజామాబాద్‌కు బీసీ కమిషన్.. వీడీసీల బహిష్కరణలపై సమావేశం