Hyderabad Knowledge Hub | తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారుస్తాం: సీఎం రేవంత్

తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ , ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం దూసుకెళ్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Knowledge Hub | తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ , ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం దూసుకెళ్తోంది. కేవలం పెట్టుబడులు, వ్యాపారాలకే కాకుండా భవిష్యత్తును తీర్చిదిద్దే మేధస్సు, నైపుణ్యాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మారుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా కీలక విషయాలను పంచుకున్నారు.

Hyderabad Knowledge Hub | హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు..

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో యూకేకి చెందిన ప్రముఖ బిజినెస్ స్కూల్స్, విశ్వవిద్యాలయాల ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, గ్లోబల్ స్కిల్స్ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై చర్చించారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ భేటీ జరిగిందని తెలిపారు.

Hyderabad Knowledge Hub | నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీలతో..

హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ స్థాయి విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. రాబోయే డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. దీనితో పాటు ఎంఐటీ (MIT), లండన్ విశ్వవిద్యాలయం, వర్జీనియా టెక్, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీలతోనూ కలిసి పనిచేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

Hyderabad Knowledge Hub | ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ లక్ష్యాలు ..

ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ రూపకల్పన జరుగుతోంది. ఇందులో ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ హబ్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, గ్లోబల్ కంపెనీలు, అత్యాధునిక రీసెర్చ్ సెంటర్లు రానున్నాయి. భవిష్యత్తుకు అవసరమైన టాలెంట్‌ను ఇక్కడే తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం తెలిపారు.

తెలంగాణను ప్రపంచం నేర్చుకోవడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి, పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వేదికగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాలను సాధించడమే తమ ప్రధాన టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇది కూడా చదవండి:  22A Land Issues | 22ఏ సమస్యల పరిష్కారానికి హై లెవల్ కమిటీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *