అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala Brahmotsavam | తిరుమల (Tirumala)లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు.
ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి గోవుల గోపన్న అలంకారంలో మాడ వీధుల్లో విహరించారు. కల్పవృక్ష వాహన దర్శనంతో కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకున్నారు.
Tirumala Brahmotsavam | రేపు గరుడ సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. గరుత్మంతుడిపై స్వామివారు విహరిస్తారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. గరుడ సేవ కోసం చెన్నై హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు తిరుమలకు చేరాయి. గరుడసేవ సందర్భంగా శనివారం ఉదయం 3 గంటల నుండే భక్తులను స్వామి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అనుమతిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి..: Chandrababu Naidu Tirumala | శ్రీవారి సన్నిధిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు