అక్షరటుడే వెబ్‌డెస్క్: Bhadrachalam Temple | భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించగా, అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆదివారం క్షేత్రాన్ని సందర్శించిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy )పనుల పురోగతిని సమీక్షించారు.
Bhadrachalam Temple | విస్తరణ ప్రక్రియ..
ఆలయ విస్తరణలో భాగంగా చిత్రకూట మండపం, వంటశాల మరియు శ్రీ కుసుమ హరనాథ్ బాబా ఆలయాన్ని ఇప్పటికే తొలగించారు. ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా మార్చేందుకు కొండ గుట్టను కూడా తొలగిస్తున్నారు. వచ్చే సంవత్సరం శ్రీరామ నవమి నాటికి మొదటి దశ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు, ఇంజనీర్లు పగలు, రాత్రి శ్రమిస్తున్నారు.
Bhadrachalam Temple | భక్తులకు ఇబ్బందులు లేవు..
పనులు జరుగుతున్నప్పటికీ, స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూనెం కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. భద్రాద్రిని అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Three Months Ration | ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం