అక్షరటుడే, ఇందూరు: OBC National Conference | బెంగుళూరులో (Bengaluru Event) ఈనెల 7న ఓబీసీ జాతీయ మహాసభ జరగనుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని (Nizamabad) కేర్ డిగ్రీ కళాశాలలో(Care Degree college) ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
OBC National Conference | మండల్ సిఫార్సులు అమలైన సందర్భంగా..
ఆగస్టు 7న మండల్ సిఫార్సులు అమలులోకి వచ్చిన సందర్భంగా 11ఏళ్లుగా జాతీయస్థాయిలో ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. ఈ ఏడాది 11వ ఓబీసీ జాతీయ మహాసభలను బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు బీసీలందరూ పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకం కావాలని, వారిని ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చేనెల 7న బెంగళూరులో ఈ కార్యక్రమం జరగనుందన్నారు.
OBC National Conference | కరపత్రాల ఆవిష్కరణ
బీసీ సంక్షేమ సంఘం అన్ని విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు నేతలతో కలిసి మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది ఓబీసీల డిమాండ్ల పరిష్కారమే ధ్యేయంగా, రాజకీయ అధికారమే లక్ష్యంగా ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసిన రోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓబీసీ జాతీయ మహాసభను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు పేర్కొన్నారు. ఈఏడాది 11వ జాతీయ మహాసభను బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ మహాసభకు 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారని రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రసాద్ తెలిపారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆకుల ప్రసాద్, పోల్కం గంగా కిషన్, దర్శనం దేవేందర్, కరిపే రవీందర్, మాడవేడి వినోద్ కుమార్, శ్రీలత, అపర్ణ, చంద్రమోహన్, రిటైర్డ్ ఎంపీడీవో గౌస్ మొహియుద్దీన్, దారం భూమన్న, గంగాధర్ సురేందర్ మహేష్, సత్యనారాయణ, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ‘మెడికల్ బోర్డును నామమాత్రంగా నిర్వహించి మరోసారి సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం’ – టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత