అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MSR Foundation Scholarships |ఎంఎస్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్థికసాయం అందుకుంటున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. నగరంలోని అమ్మ వెంచర్లో ఓ ఫంక్షన్ హాల్లో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.
MSR Foundation Scholarships | రూ.13లక్షల స్కాలర్‌షిప్‌లు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్కాలర్షిప్ పొందిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మొత్తం 30 మంది ఉత్తమ విద్యార్థులకు రూ.13లక్షల మేరకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారి తమ ఉజ్వల జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ హితవు పలికారు. క్రమశిక్షణతో కూడిన జీవితాలను విద్యార్థి దశ నుండే అలవాటు చేసుకుని తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిత్వంతో ముందుకు సాగాలని సూచించారు. ఫౌండర్ శివారెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నామన్నారు. స్కాలర్‌షిప్ తీసుకున్న విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కో ఫౌండర్ శిరీషతో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: A little more of Rudhra’s world… #Varanasi