POCSO Case | బాలికపై అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు

మైనర్​ను ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడు. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: POCSO Case | మైనర్​ను ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడు. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు (Banswada police) పోక్సో కేసు నమోదు చేశారు.

POCSO Case | ప్రేమ పేరుతో..

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..  బాన్సువాడ (Banswada) మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్​ తన బంధువులకు చెందిన బాలికతో మూడేళ్ల క్రితం పరిచయం పెంచుకున్నాడు.,  తన భార్యకు పిల్లలు ఉన్నా.. చెప్పకుండా బాలికను ప్రేమిస్తున్నానని దగ్గరయ్యాడు. పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు బాలికను బంధువుల ఇంటికి పంపి రెండు నెలల పాటు అక్కడే ఉంచారు. తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని కోరగా వివాహం చేసుకునేది లేదని సదరు వ్యక్తి పేర్కొన్నాడు.  దీంతో తనను మాయమాటలు  చెప్పి మోసం చేశాడని పేర్కొంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు సంబంధిత వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *